ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్‌ కాగ్నిజబుల్‌ నేరం

‘ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్‌ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది.

Updated : 06 May 2024 07:00 IST

 సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ‘ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్‌ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. ప్రజలు తమ సంపదను కాపాడుకోవాలంటే తెదేపాకు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. దీనిమీద వైకాపా చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నాన్‌ కాగ్నిజబుల్‌ నేరంగా పరిగణించాల్సి వస్తుంది’ అని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎక్స్‌ వేదికగా చెప్పారు. ‘ప్రత్యర్థుల చెడు విధానాలను ప్రజలకు వివరించి, తద్వారా తమకు ఓటు వేసేలా ప్రజలను ఒప్పించడం ఎన్నికల ప్రచారంలో భాగం కాదా? కాబట్టి ఐపీసీ సెక్షన్‌ 171జి వర్తించదు. వాస్తవ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా అధికారుల నుంచి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సర్టిఫికెట్‌ పొందేందుకు తెదేపా దుర్మార్గంగా వ్యవహరించడం కంటెంట్‌ ఎంసీఎంసీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదు సీఈఓ కార్యాలయానికి పంపినందున ప్రభుత్వ ఉద్యోగి ఆదేశాలను ధిక్కరించిన నేరంగా పరిగణించడానికి వీల్లేదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై నమోదైన కేసుల విషయంలో ఆయన స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని