నాలుగు స్తంభాలాట

ఒకప్పుడు ఇళ్ల ముందు పందిళ్లు వేసేవారు. మండువా లోగిళ్లు, పెంకుటిళ్లు ఉండేవి. దాంతో అక్కడ ఉండే స్తంభాలను పట్టుకుని పిల్లలు... ఆటలాడేవారు. అయితే, కాలక్రమంలో అన్నీ కాంక్రీట్‌ కట్టడాలుగా మారాయి. తరమూ మారింది. ఇప్పుడు స్తంభాలకు బదులు కర్రలతో ఈ ఆటను ఆడేస్తున్నారు.

Updated : 29 Apr 2024 14:49 IST

కప్పుడు ఇళ్ల ముందు పందిళ్లు వేసేవారు. మండువా లోగిళ్లు, పెంకుటిళ్లు ఉండేవి. దాంతో అక్కడ ఉండే స్తంభాలను పట్టుకుని పిల్లలు... ఆటలాడేవారు. అయితే, కాలక్రమంలో అన్నీ కాంక్రీట్‌ కట్టడాలుగా మారాయి. తరమూ మారింది. ఇప్పుడు స్తంభాలకు బదులు కర్రలతో ఈ ఆటను ఆడేస్తున్నారు.  అదెలాగంటారా? ఎంతమంది ఉన్నారో అన్ని కర్రలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ కుడిచేత్తో ఒక కర్ర పట్టుకుని, ఎడమ చేతిని వెనక్కి పెట్టి గుండ్రంగా నిలబడండి. ఇప్పుడు అదే క్రమంలో తిరుగుతూ... పట్టుకున్న కర్రని వదిలి...మరొకరి చేతిలో ఉన్నదాన్ని అందుకోవాలి. ఎవరైతే ముందువాళ్ల కర్ర పట్టుకోలేక వదిలేస్తారో వాళ్లు ఆట నుంచి బయటకి వెళ్లిపోతారు. ఈ ఆట వల్ల మెదడుకీ, శరీరానికీ సమన్వయం ఏర్పడుతుంది. ఏకాగ్రత అలవడుతుంది. బృంద స్ఫూర్తినీ తెలుసుకోగలుగుతారు.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్