ఆడేద్దామా తొక్కుడు బిళ్ల

తొక్కుడు బిళ్ల ఆట పేరు వినగానే... చిన్నప్పడు మనం ఆడిన రోజులు గుర్తొస్తున్నాయి కదా! అయితే, మనం దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటగా, ముఖ్యంగా మన భారతీయ చిన్నారులు ఆడుకునేదిగా భావిస్తాం.

Published : 28 Apr 2024 01:40 IST

తొక్కుడు బిళ్ల ఆట పేరు వినగానే... చిన్నప్పడు మనం ఆడిన రోజులు గుర్తొస్తున్నాయి కదా! అయితే, మనం దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటగా, ముఖ్యంగా మన భారతీయ చిన్నారులు ఆడుకునేదిగా భావిస్తాం. కానీ, హాప్‌స్కాచ్‌ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా దీనికున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అతి పురాతనమైన ఈ క్రీడ, రోమన్ల పాలనా కాలంలో బ్రిటన్‌లో ప్రారంభమైందని చెబుతారు. అయితే, బ్రిటిష్‌ సామ్రాజ్యంలో సైనిక శిక్షణ కోసం సుమారు వంద అడుగుల పొడవుతో ఉండే కోర్టుల్లో ఈ ఆటను ఆడించేవారట. ఆ తరవాత అనేక మార్పులకు లోనై... ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరున ఈ ఆటను ఆడేస్తున్నారు. పది అంకెలు వచ్చేలా నేలపై పెద్ద పెద్ద గడులతో నిలువు, అడ్డంగా బాక్సులతో కోర్టుని గీస్తారు. ఆడేవారు బయట నిలబడి కాయిన్‌ లేదా పెంకుని అందులో వేసి ఒంటికాలితో వెళ్లి తేవాలి. ఈ క్రీడ ఏకాగ్రతనూ, చేతికీ, మెదడుకీ మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. మరింకెందుకాలస్యం. వేసవి సెలవుల్లో పిల్లలతో ఆడించేయండి. వాళ్లూ కొత్తగా ఉందే అని సంబరపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్