సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!

సాధారణంగా ఒత్తిడి పెద్దల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, పిల్లల్లోనూ ఎక్కువే అంటున్నాయి పలు అధ్యయనాలు. దీన్ని తగ్గించడానికి పనిచేస్తుందో సరదా ఆట.

Updated : 02 May 2024 13:27 IST

సాధారణంగా ఒత్తిడి పెద్దల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ, పిల్లల్లోనూ ఎక్కువే అంటున్నాయి పలు అధ్యయనాలు. దీన్ని తగ్గించడానికి పనిచేస్తుందో సరదా ఆట. అదే సోప్‌ బబుల్‌ గేమ్‌. విన్నట్లే ఉంది కదూ! చిన్నప్పుడు మనం నీళ్లల్లో కాస్త సర్ఫ్‌ కలిపి  బొప్పాయి ఆకుల గొట్టాల సాయంతో బుడగల్ని సృష్టించి సంబరపడిపోయేవాళ్లం. ఇప్పుడు దాన్నే మీ చిన్నారికీ నేర్పించండి. ఇందుకోసం మూడు వంతుల నీళ్లు, ఒక వంతు సర్ఫ్‌ తీసుకోండి. అందులోనే ఓ చెంచా గ్లిజరిన్‌ కూడా చేర్చి బాగా గిలకొట్టండి. అందులో రింగులాంటిదాన్నో, బొప్పాయి ఆకు కాడనో ముంచి తీసి వారిని బలంగా ఊదమనండి. ఎన్ని బుడగలు వస్తాయో! గాల్లోకి ఎగిరే ఆ బబుల్స్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించడంలో వారెంతో సంతోషపడిపోతారు. ఇలా ఉదయమో, సాయంత్రమో ఆరుబయట ఆడితే... బబుల్స్‌ కాస్తా కాంతి పరావర్తనం కారణంగా రంగుల్లోకి మారి ఆకట్టుకుంటాయి. మెదడుకీ తగినంత ఆక్సిజన్‌ అంది చురుగ్గా పనిచేస్తుంది. ఒంట్లో రక్తసరఫరా సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆట వల్ల ఆనందాన్ని కలిగించే హార్మోన్లు విడుదలై ఒత్తిడినీ తగ్గిస్తాయి.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్