యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!

తన టీనేజీ కూతురితో దుబారా ఖర్చునెలా తగ్గించాలో తెలియక సునీత సతమతమవుతోంది. ఆమే కాదు.. ప్రతి తల్లీ చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవరచాలి అంటారు నిపుణులు.

Published : 30 Apr 2024 01:55 IST

తన టీనేజీ కూతురితో దుబారా ఖర్చునెలా తగ్గించాలో తెలియక సునీత సతమతమవుతోంది. ఆమే కాదు.. ప్రతి తల్లీ చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవరచాలి అంటారు నిపుణులు. అదెలాగంటే...

దాయాన్ని బట్టే ఖర్చులుండాలన్న విషయం పెద్దవాళ్లకే కాదు, పిల్లలకూ తెలిసుండాలి. యుక్త వయసుకొచ్చేసరికి దీనిపై వారికి అవగాహన తేగలగాలి. మీరిచ్చే పాకెట్‌మనీ మొత్తం ఖర్చు చేయడానికి కాదని మొదటే చెప్పాలి. అందులో సగ భాగాన్ని పొదుపు చేసేలా ప్రోత్సహించాలి. దానివల్ల ప్రయోజనాలేంటో, అత్యవసరానికి అదెలా ఉపయోగపడుతుందో వివరించాలి. ఈ అలవాటు ఖర్చులపై నియంత్రణ కోల్పోకుండా చేస్తుంది.

బాధ్యతలు తెలిసేలా...

ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో పిల్లలను భాగస్వాములను చేయాలి. అద్దె, నిత్యావసర వస్తువులు, కరెంటు... ఇలా నెలకయ్యే మొత్తం ఖర్చును వివరంగా పుస్తకంలో పొందుపరిచి పిల్లలకివ్వాలి. మీకొచ్చే ఆదాయం, నెలవారీ ఖర్చులు పోగా మీరు చేసిన పొదుపు గురించీ వారిని లెక్కించమనండి. మీరు వాటినెలా సమన్వయం చేస్తున్నారో చెప్పండి. సెలవు రోజుల్లో సరిపడినంత నగదు వారి చేతికిచ్చి... ఒక నెల బడ్జెట్‌ బాధ్యత అప్పగించండి.  . కుటుంబ అవసరాలు సహా ఆ నెలలో వచ్చే పుట్టినరోజులు లేదా పండుగలకయ్యే అదనపు ఖర్చును వారెలా సమన్వయం చేస్తారో చూడాలి. ఎక్కడైనా తడబడుతుంటే సూచనలివ్వండి. ఇవన్నీ సర్దుబాట్లు తెలిసేలా చేస్తాయి.

ఆ గీత దాటకుండా...

స్కూల్‌, కాలేజీ తెరుస్తున్నప్పుడు దుస్తులు, బూట్లు వంటివి కొనడానికెళ్లేటప్పుడు ముందుగానే వారికి బడ్జెట్‌ ఇవ్వండి. అందులోనే అవసరాలన్నీ తీరేలా ప్రణాళిక వేసుకోమనండి. లెక్క దాటేస్తే...ఆ డబ్బుల్ని వారి పొదుపు నుంచి తీసుకోమంటే సరి. జాగ్రత్తగా ఉంటారు. తమ కోసం దాచుకున్న నగదును వినియోగించాలంటే వారిలో నియంత్రణ మొదలవుతుంది. వారివద్ద పొదుపు చేసిన నగదు లేకపోతే తిరిగి తీర్చమని చెప్పి అప్పుగా ఇవ్వాలి. దాన్నెలా తీర్చాలో చెప్పాలి. మనీ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాల అలవరుస్తాయివి. అంతేకాదు.. వారు చేసే ప్రతి ఖర్చూ రాయమంటే సరి. పునఃపరిశీలించుకోవడం ఎలానో తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్