TS News: రాష్ట్రంలో 10 లోక్‌సభ స్థానాలపై భాజపా గురి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35 శాతం ఓట్లు, 10 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా (BJP) అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భాజపా 300కు పైగా లోక్‌సభ సీట్లు సాధిస్తుందని, నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కూడా భాజపాను గెలిపించి మోదీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని కొంగరకలాన్‌ వద్ద గురువారం ఏర్పాటు చేసిన భాజపా విస్తృతస్థాయి సమావేశంలో అమిత్‌షా ప్రసంగించారు.

Published : 29 Dec 2023 10:23 IST

Tags :

మరిన్ని