AP News: దోపిడీలో పీజీ చేసిన పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధి

‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు.

Published : 27 Apr 2024 13:18 IST

ప్రతిపక్షనేత, ప్రత్యర్థి వర్గంపై నోరుపారేసుకుంటేనే సీటు ఖరారు చేసే విధానం ఉన్న వైకాపాలో బూతులు మాట్లాడే రేసులో ఆయన ముందుంటారు. తిట్లలో ఒక డిగ్రీ ఎక్కువే చేశారు. సోషల్ మీడియాలోనూ తిట్ల ట్వీట్ల దండకం అందుకుంటారు. పండగొస్తే సంబరాలను అంబరాన్ని తాకించి డ్యాన్సులతో దుమ్మురేపుతారు. నిజానికి సహజ వనరుల దోపిడీకి ఆయన పెట్టింది పేరు. కోట్లు వెనుకేసుకోవడమే కాదు భారీగా భూములను పోగేసుకున్నారు. పల్నాడు జిల్లాలో ఓ నియోజకవర్గంలో ఆయనకు ముడుపు చెల్లించాకే ఏ పని అయినా మొదలెట్టాలి. బదిలీల నుంచి గుత్తేదారులకు పనుల వరకు అన్నింటిలో ఆయనకు పర్సంటేజీలు ముట్టజెప్పాలి.

Tags :

మరిన్ని