AP News: మంత్రి అప్పలరాజు జులుం.. ఎన్నికల అధికారికి బెదిరింపులు!

మంత్రి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని శుక్రవారం వైకాపా ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత ఆపారు. దీంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు.

Published : 27 Apr 2024 14:53 IST

AP News: మంత్రి అప్పలరాజు జులుం.. ఎన్నికల అధికారికి బెదిరింపులు!

మంత్రి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని శుక్రవారం వైకాపా ప్రచార రథాన్ని ఎన్నికల అధికారి ఆశాలత ఆపారు. దీంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ప్రచార రథం, రూ.లక్ష ఆమెకు ఇచ్చేయండంటూ తన అనుచరులను ఆదేశించారు. మీ ఇష్టమొచ్చినట్లు తయారు చేసి వాహనాన్ని ఇవ్వాలని అధికారితో మాటల యుద్ధానికి దిగారు. నిబంధనలు చెబుతుంటే గొడవ పెట్టుకుంటారేంటని అధికారి మంత్రిని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఆవేశంతో ఇంకోసారి వైకాపా ప్రచార రథం ఆపితే బాగోదని హెచ్చరించారు. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని.. మీరొక్కరే విధులు నిర్వర్తిస్తున్నారా అని అధికారిని బెదిరించారు. 

Tags :

మరిన్ని