మా బతుకులంటే నవ్వులాటగా ఉందా?: వైకాపా ఎమ్మెల్సీ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ వ్యవహరించిన తీరుపై అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం బైపాస్ రోడ్దు కూడలి వద్ద అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని చూస్తూ.. ఎమ్మెల్సీ భరత్‌ నవ్వుతూ కారులో వెళ్లారంటూ వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న నిరసన.. అధికార పార్టీ పాలకులకు నవ్వులాటగా మారిందంటూ వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Published : 24 Dec 2023 17:50 IST

Tags :

మరిన్ని