Budget 2023: బడ్జెట్‌ కసరత్తు పూర్తి.. హల్వా కార్యక్రమంలో నిర్మలమ్మ

కేంద్ర బడ్జెట్ కసరత్తు పూర్తైన వేళ.. సంప్రదాయ హల్వా కార్యక్రమాన్ని ఆర్థికశాఖ నిర్వహించింది. బడ్జెట్ ప్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. చిన్న కప్పుల్లో హల్వా వేసిన మంత్రి.. అక్కడి ఉద్యోగులకు స్వయంగా అందించారు. గతంలో బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయంగా పాటించేవారు. ఐతే, కొవిడ్ కారణంగా గత రెండు బడ్జెట్‌లను ముద్రణలేకుండా కాగితరహితంగానే పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

Published : 26 Jan 2023 20:04 IST

మరిన్ని