మాయా కేకును చేసేద్దామా

సంతోషాన్ని ఇచ్చే సందర్భం ఏదైనా సరే, ఇంట్లో కేక్‌ కట్‌ చేసేస్తుంటాం. అందుకోసం కొంతమంది బయటి నుంచి కేకులు తెప్పిస్తే... ఇంకొంతమంది ఇంట్లోనే వాటిని తయారు చేసేస్తుంటారు.

Published : 18 Dec 2022 00:35 IST

మాయా కేకును చేసేద్దామా

సంతోషాన్ని ఇచ్చే సందర్భం ఏదైనా సరే, ఇంట్లో కేక్‌ కట్‌ చేసేస్తుంటాం. అందుకోసం కొంతమంది బయటి నుంచి కేకులు తెప్పిస్తే... ఇంకొంతమంది ఇంట్లోనే వాటిని తయారు చేసేస్తుంటారు. ఎప్పుడూ ఒకేలా ఎందుకంటూ ఒక్కో వేడుకకూ ఒక్కో ఆకారంలో కేకుకు రూపమిస్తుంటారు. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా మార్కెట్లో ‘కేక్‌ మేకింగ్‌ కిట్స్‌’ వస్తున్నాయి. ఇప్పుడు అదే వరసలో వచ్చింది ‘యాంటీ గ్రావిటీ కేక్‌ కిట్‌’ కూడా. ఏదో ఇంద్రజాలంతో చాక్లెట్‌ డబ్బానో, పూలగుత్తినో, కోక్‌ టిన్నునో గాల్లో తేలినట్టు చూపించే ఈ కేకుల్ని ఇంట్లోనూ చేసేయొచ్చన్నమాట. కింద కేక్‌ పెట్టడానికి బేస్‌తో పాటు మధ్యలో చిన్న వంపుతో ఉన్న పైపులాంటిది ఉంటుంది. దాని ఆధారంగా మనకు నచ్చిన థీమ్‌లో గాల్లో తేలినట్టు కనిపించే కేకును తయారు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..