అధిక ప్రవాహమే దెబ్బతీసింది

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో అత్యధికంగా ప్రవాహం కొనసాగడంతో రాజంపేట, నందలూరు మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని, 39 మంది గల్లంతయ్యారని కేంద్ర బృందం సభ్యులకు అధికారులు వివరించారు. బృందం సభ్యులు డాక్టర్‌ మనోహర్‌, శివానీశర్మ, శ్రీనివాసు భైరీలు.

Published : 28 Nov 2021 04:07 IST

అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర బృందానికి కడప జిల్లా యంత్రాంగం నివేదన

కడప, ఈటీవీ: కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో అత్యధికంగా ప్రవాహం కొనసాగడంతో రాజంపేట, నందలూరు మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని, 39 మంది గల్లంతయ్యారని కేంద్ర బృందం సభ్యులకు అధికారులు వివరించారు. బృందం సభ్యులు డాక్టర్‌ మనోహర్‌, శివానీశర్మ, శ్రీనివాసు భైరీలు... కలెక్టర్‌ విజయరామరాజు, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణిలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం పర్యటించారు.  తొలుత రాజంపేట మండలం పులపుత్తూరుతో చెయ్యేరు నది ఒడ్డున ప్రవాహన్ని పరిశీలించారు. మందపల్లికి చేరుకుని జరిగిన నష్టాన్ని చూశారు. బాధితులతో మాట్లాడారు. 10వేల బస్తాల ధాన్యం నీటిపాలైందని రైతులు వివరించారు. అన్నమయ్య జలాశయం మట్టి కట్ట భారీగా కోతకు గురైన విషయాన్ని గుర్తించారు. గేట్ల పైనుంచి నీటి ప్రవాహం సాగిందని, అత్యధిక ప్రవాహం రావడంతో మట్టికట్ట తెగిపోయిందని నీటిపారుదలశాఖ సీఈ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. కడపలో నష్టతీవ్రతపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. కడప బుగ్గవంక, కమలాపురం వద్ద దెబ్బతిన్న పాపాఘ్నినది వంతెనలను కూడా పరిశీలించారు. జిల్లాలో వరదల కారణంగా రూ.1,221 కోట్లు నష్టం జరిగిందని, ఆదుకోవాలని కేంద్ర బృందానికి ఎంపీ అవినాష్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని