విద్యుత్తు తీగలు తెగిపడి నిలిచిన రైళ్లు

వరంగల్‌ జిల్లా చింతలపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఆదివారం రాత్రి విద్యుత్తు తీగలు (ఓహెచ్‌ఈ) తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు

Published : 20 Jun 2022 04:35 IST

కాజీపేట, గిర్మాజిపేట, న్యూస్‌టుడే : వరంగల్‌ జిల్లా చింతలపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఆదివారం రాత్రి విద్యుత్తు తీగలు (ఓహెచ్‌ఈ) తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు విద్యుత్తు తీగల మీద చెట్లకొమ్మలు పడడంతో అవి తెగి కింద పడ్డాయి. దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయి రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. సికింద్రాబాదు నుంచి చెన్నై వెళ్లే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతికి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లను కాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. కాజీపేటటౌన్‌ స్టేషన్‌లో బిలాస్‌పూర్‌, కరీంనగర్‌-తిరుపతి, కాచిగూడ-విశాఖపట్నం రైళ్లు ఆగాయి. పద్మావతి, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లకు విద్యుత్తు ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో డీజిల్‌ ఇంజిన్లను అమర్చి నడిపించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని