చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరం లేదు
దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేం
చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భజన్‌లాల్ కేసు మొదలు నిహారిక ఇన్ఫ్రా కేసు వరకూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే సీఆర్పీసీ సెక్షన్ 482 (క్వాష్) ప్రకారం ప్రస్తుత కేసులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసుకు చెందిన వాస్తవాల విషయంలో ఇరువైపుల సీనియర్ న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై సెక్షన్ 482 కింద హైకోర్టు మినీ ట్రైల్ నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ కేసు 2021 డిసెంబరు 9న నమోదైందని, దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి, 4వేలకు పైబడి దస్త్రాలను సేకరించిందని గుర్తుచేసింది. నిధుల దుర్వినియోగం వ్యవహారం అస్పష్టమైనదని, దాన్ని తేల్చేందుకు అత్యంత నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరం అని పేర్కొంది. దర్యాప్తు తుది దశలో ఉన్న ఈ సమయంలో ఎఫ్‌ఐఆర్‌లోను, జ్యుడిషియల్ రిమాండు ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోను జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
నిజాయతీగా విధులు నిర్వహించిన ప్రజాసేవకుడి రక్షణ కోసమే సెక్షన్ 17ఏ
సదుద్దేశంతో నిజాయతీగా విధులు నిర్వహించిన ప్రజా సేవకుడికి (పబ్లిక్ సర్వెంట్) రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో శాసనకర్తలు అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏను 2018 జులై 26న తీసుకొచ్చారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పబ్లిక్ సర్వెంట్ చర్యలు నేరపూరితమైనవిగా కనిపిస్తున్నప్పుడు దర్యాప్తు చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు దస్త్రాలు సృష్టించడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం అనేది ప్రజాసేవకుడి అధికారిక విధుల్లో భాగం కాదన్నారు. కొన్ని దస్త్రాల ఆధారంగా నిధుల విడుదలకు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, లేదా సిఫారసు చేయడం ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడటాన్ని అధికారిక విధుల్లో భాగమని చెప్పలేమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు చేసేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే
జగన్ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ. పిల్లలకు ఇచ్చే కళ్లజోళ్ల మీద కూడా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు దర్శనమిచ్చాయి. -
AP Officers: ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?
‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు... వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
అనగనగా అవుకు.. పూర్తికాకుండానే టముకు
అనగనగా అదొక అవుకు టన్నెల్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్‌ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్
ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. -
అడిగేదెవరని.. అడ్డే లేదని!
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. -
చదువూ లేదు.. కొలువూ రాదు!
పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్‌నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇక్కడ ఓటుంటేనే గుంతలు పూడుస్తాం
ఓటరు కార్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలనే విచిత్ర ఆలోచన చంద్రగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు వచ్చింది. -
ఆ తీర్పును తెలుగు చేసి పోలీసులకు పంపండి
లలితకుమారి వర్సెస్ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని రాష్ట్రంలోని పోలీసు అధికారులకు మరోసారి పంపాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. -
నిరుపయోగంగా ఏకరూప దుస్తులు
-
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. -
మౌనంగా విన్నారు.. వెళ్లారు
ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ తొలి విడత జిల్లా పర్యటన గంటన్నర వ్యవధిలో ముగిసింది. ప్రధాన రాజకీయ పక్షాలు, అధికారులు చెప్పింది మౌనంగా విన్నారు. -
ఎస్ఆర్ఎం వీసీ మనోజ్ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక ‘భాస్కర’ అవార్డు
ఏపీ-ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోడాకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘భాస్కర’ అవార్డు లభించింది. -
ఇదేం అస్తవ్యస్త ఇసుక విధానం?
ఇసుక తవ్వకాలపై రాష్ట్రప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల లారీ యజమానులు మండిపడ్డారు. -
బ్రిటిష్ పాలనను తలదన్నేలా రాష్ట్రంలో నిర్బంధకాండ
-
వైకాపా నాయకులు వేధిస్తున్నారని.. అయిదుగురు వాలంటీర్ల రాజీనామా
‘వైకాపా నాయకుల వేధింపులు భరించలేకున్నాం. పని కూడా చేయలేకపోతున్నాం’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సచివాలయానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు. -
వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం భాజపా కిసాన్ మోర్చా చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. -
అంగట్లో బోగస్ సర్టిఫికెట్లు
సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్‌తో సినిమా ఉంటుంది: సందీప్
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు
-
Bullet train: తొలి బుల్లెట్ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!