ల్యాండ్‌ టైటిలింగ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్‌పై సీఐడీ కేసు

తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా మొత్తం 10 మందిపైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

Published : 06 May 2024 05:07 IST

వైకాపా ఫిర్యాదు మేరకు మరో 8 మందిపై కూడా..

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా మొత్తం 10 మందిపైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై తెదేపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 171 (ఎఫ్‌)(జీ), 188, 505 (2) రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ, తెదేపా ఎలక్ట్రానిక్‌ ప్రచార బృందం, సాంకేతిక నిపుణులు, వ్యాపారులను నిందితులుగా పేర్కొంది. ఇదే కేసులో తెదేపా కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఆదివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవటంతో మేనేజర్‌ శ్రీకాంత్‌కు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయ ఇన్‌స్పెక్టర్‌ జి.తిరుమలరావు నోటీసులిచ్చారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని