ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకల కేసు.. సుప్రీంకోర్టులో మరో ధర్మాసనానికి

ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని పేర్కొంటూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వైదొలిగారు.

Published : 07 Nov 2023 03:39 IST

విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర

ఈనాడు, దిల్లీ: ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని పేర్కొంటూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వైదొలిగారు. ఈ అంశంపై సోమవారం లిస్ట్‌ అయిన సిటిజెన్స్‌ ఫర్‌ డెమొక్రసీ వర్సెస్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కేసు సోమవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే విచారణ నుంచి జస్టిస్‌ మిశ్ర వైదొలగడంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కేసును మరో ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఉత్తర్వులు జారీచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఓటర్ల నమోదులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యథేచ్ఛగా జోక్యం చేసుకుంటోందంటూ సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ ఈ పిటిషన్‌ వేసింది. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేస్తున్నట్లు అందులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని