Air India: ఎయిర్ ఇండియా చేతికి బాహుబలి విమానం

Air India: ఎయిరిండియా చేతికి మొట్టమొదటి వైడ్‌- బాడీ విమానం అందింది. 316 సీట్లు ఉన్న ఈ బాహుబలి విమానం దిల్లీలో ల్యాండ్‌ అయింది.

Published : 23 Dec 2023 21:54 IST

Air India | దిల్లీ: టాటా గ్రూప్‌ నేతృత్వంలోని ఎయిరిండియా (Air India) చేతికి మొట్టమొదటి వైడ్‌ - బాడీ ఏ350-900 (VT-JRA) విమానం అందింది. ఈ బాహుబలి విమానం ఫ్రాన్స్‌లోని ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ (Airbus) నుంచి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో ఈ తరహా విమానాలను కలిగి ఉన్న మొదటి విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ‘ఎక్స్‌’ ద్వారా పంచుకుంది.

ఎయిర్‌బస్‌ నుంచి పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఆర్డర్‌ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఎయిర్‌బస్‌ వైడ్‌ బాడీ విమానాలు 20 ఉన్నాయి. వీటిలో తొలి విమానమైన ఏ350- 900 తాజాగా ఎయిర్‌ఇండియా చేతికి వచ్చింది. మరో ఐదు విమానాలు వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయని సంస్థ పేర్కొంది. ఎయిర్‌బస్‌కు ఆర్డర్‌ పెట్టిన వాటిలో 40 ఏ350లు, 20 ఏ350-900, 20 ఏ350-1000 విమానాలు, 140 నారో బాడీ ఏ321 నియో, 70 ఏ320 నియో విమానాలు ఉన్నాయి.

నెలల ముందే రిటర్ను పత్రాలు నోటిఫై చేసిన సీబీడీటీ

ఏ350-900 విమానంతో సూదూర మార్గాల్లో నాన్‌స్టాప్‌గా ప్రయాణించొచ్చని ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. ఈ విమానాలను మొదట తక్కువ దూరం ఉన్న మార్గాల్లో వినియోగించి తర్వాత సుదూర ప్రయాణాలకు వినియోగించనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ విమానాలు వాణిజ్య సేవలు అందిస్తాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది. 316 మందితో ఒకేసారి ప్రయాణించగలిగే ఈ విమానంలో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్‌లు, అదనపు లెగ్‌రూమ్‌లతో కూడిన 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, 264 విశాలమైన ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయని ఎయిరిండియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని