FD Rates: వడ్డీ రేట్లను సవరించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఎఫ్‌డీలపై 30 బీపీఎస్‌ పాయింట్లు పెంచింది.

Published : 12 May 2023 19:35 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. సీనియర్‌ సిటిజన్లు ఈ బ్యాంకులో గరిష్ఠంగా 7.75% వరకు వడ్డీ రేటును పొందొచ్చు. 7-14 రోజుల కనీస డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లు 3% వడ్డీ, సీనియర్‌ సిటిజన్లు 3.50% వడ్డీని ఈ బ్యాంకులో పొందొచ్చు. ఒక ఏడాది డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లు 6.75% వడ్డీని పొందుతుండగా.. ఇదే డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్లకు 7.25% వడ్డీ లభిస్తుంది. 399 రోజుల (బరోడా తిరంగా ప్లస్‌) ప్రత్యేక డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లు 7.25% వడ్డీని పొందుతారు. సీనియర్‌ సిటిజన్లు ఇదే డిపాజిట్‌పై 7.75% వరకు వడ్డీ పొందొచ్చు. ఈ బ్యాంకులో ఇదే గరిష్ఠ వడ్డీ రేటు. ఈ బ్యాంకులో 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలు చేయొచ్చు. ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. సవరించిన రేట్లు 2023 మే 12 నుంచి అమల్లోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని