Scam alert: టెలిగ్రామ్‌లో సినిమాలా? జాగ్రత్తగా ఉండండి!

Telegram scams: సైబర్‌ దాడులపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను అనుసరిస్తూ కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. తాజాగా టెలిగ్రామ్‌ యాప్‌ని ఆసరాగా చేసుకొని డబ్బుల్ని దోచుకుంటున్నారు.

Updated : 28 Dec 2023 17:41 IST

Telegram scams | ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్తగా రిలీజ్‌ అయిన సినిమా, వెబ్‌సిరీస్‌ చూడాలంటే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది టెలిగ్రామ్‌ (Telegram). ఓటీటీలో రిలీజ్‌ అవ్వగానే సబ్‌స్క్రిప్షన్‌ లేకపోయినా వెంటనే అందులో ప్రత్యక్షమవుతుంది. దీంతో ఎడాపెడా టెలిగ్రామ్‌ గ్రూపుల్లో చేరుతున్నారు. వీరి ఆసక్తే ఆసరాగా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు.

ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిస్టింగ్‌ అదుర్స్‌.. 7 రెట్లు పెరిగిన సచిన్‌ పెట్టుబడి!

సినిమా పేరు సెర్చ్‌ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్‌లోడింగ్‌ అంటూ లింక్‌లు కనిపిస్తాయి. చాలామంది ఇలా లింక్‌లు కనిపించగానే వెంటనే దాన్ని క్లిక్‌ చేసేస్తారు. ఉచితంగా సినిమాలు చూడాలంటే యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి అని కొన్ని గ్రూప్‌లు సూచిస్తాయి. ఏమౌతుందిలే అని డౌన్‌లోడ్‌ చేశారో అంతే సంగతి. మీ వ్యక్తిగత వివరాలు మొత్తం ప్రమాదంలో పడినట్లే. ఇలా సినిమా పేరుతో లింక్‌లు క్రియేట్‌ చేసి యూజర్ల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఈ తరహా మోసాలు టెలిగ్రామ్ యాప్‌లో జరుగుతున్నాయని సైబర్‌ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్‌ దోస్త్‌ (Cyber Dost) తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలా టెలిగ్రామ్‌ లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని