YouTube: యూట్యూబ్ మాజీ సీఈఓ కుమారుడి అనుమానాస్పద మృతి

YouTube: క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Published : 18 Feb 2024 10:45 IST

వాషింగ్టన్‌: యూట్యూబ్‌ (YouTube) మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.

‘డ్రగ్‌’ మోతాదు ఎక్కువ కావడంతోనే ట్రోపర్‌ మరణించి ఉంటాడని ఆయన బామ్మ ఎస్తర్‌ వోజ్కికీ అనుమానం వ్యక్తం చేశారు. ‘‘అతను డ్రగ్ తీసుకున్నాడు. అందులో ఏముందో మాకు తెలియదు. అది డ్రగ్‌ అని మాత్రం చెప్పగలం’’ అని తెలిపారు. శవపరీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించారు. అతని మరణంతో తమ కుటుంబం తీవ్ర విశాదంలో మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గణితం పట్ల అతనికి చాలా ఆసక్తి అని.. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవాడని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని