హీరో మోటోకార్ప్‌ సరికొత్త ‘జూమ్‌’ స్కూటర్‌

హీరో మోటోకార్ప్‌ దేశీయ విపణిలోకి సరికొత్త స్కూటర్‌ ‘జూమ్‌’ను విడుదల చేసింది. పరిచయ ధరల శ్రేణి రూ.68,599- 76,699 అని సంస్థ తెలిపింది.

Published : 31 Jan 2023 02:35 IST

ధరల శ్రేణి రూ.68,599- 76,699

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ దేశీయ విపణిలోకి సరికొత్త స్కూటర్‌ ‘జూమ్‌’ను విడుదల చేసింది. పరిచయ ధరల శ్రేణి రూ.68,599- 76,699 అని సంస్థ తెలిపింది. కొవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొన్నందున, స్కూటర్లకు పెరిగిన డిమాండు దృష్ట్యా ఈ కొత్త స్కూటర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. 110సీసీ బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌తో హీరో జూమ్‌ లభ్యంకానుంది. డిజిటల్‌ స్పీడోమీటర్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాలర్‌ ఐడీ, ఎస్‌ఎమ్‌ఎస్‌ అప్‌డేట్లు, ఇంధనం, ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ స్థాయిలను తెలియజేసే సూచీలు ఇందులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని