ATM: ఏటీఎంల్లో రూ.2,000 నోట్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు లేవు

ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్ల (ఏటీఎంల)లో రూ.2,000 నోట్లను ఉంచడం/ఉంచకపోవడంపై బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Updated : 21 Mar 2023 08:38 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్ల (ఏటీఎంల)లో రూ.2,000 నోట్లను ఉంచడం/ఉంచకపోవడంపై బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆయా బ్యాంకులు వాటి ఎంపిక ప్రకారం మేరకు ఏటీఎంల్లో పెద్ద నోట్లను ఉంచడం లేదా ఉంచకపోవడం జరుగుతోందని సోమవారం ఆమె పార్లమెంటుకు తెలియజేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వార్షిక నివేదికల ప్రకారం, చెలామణిలో ఉన్న రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చిలో రూ.9.512 లక్షల కోట్లు కాగా, 2022 మార్చి ఆఖరుకు రూ.27.057 లక్షల కోట్లని ఆమె లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* 2023 మార్చి 31 నాటికి ప్రభుత్వ అప్పులు సుమారు రూ.155.8 లక్షల కోట్లు (జీడీపీలో 57.3 శాతం) ఉన్నాయని మరో ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఇందులో విదేశీ అప్పులు (ప్రస్తుత మారకపు రేటు ప్రకారం) రూ.7.03 లక్షల కోట్లు (జీడీపీలో 2.6 శాతం) ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పుల్లో వీటి వాటా కేవలం 4.5 శాతమేనని, జీడీపీలో 3 శాతం కంటే తక్కువని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని