House Rates: ఇళ్ల ధరలు 5% పెరుగుతాయ్
ఈ ఏడాది ఇళ్ల ధరలు 8-10 శాతం పెరిగాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో ఐదు శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
2023-24పై ఇండియా రేటింగ్స్ అంచనా
దిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు 8-10 శాతం పెరిగాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో ఐదు శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వచ్చే ఏడాది నివాస స్థిరాస్తి రంగ అంచనాలను ‘మెరుగుపడుతోంది’ నుంచి ’తటస్థానికి’ మార్చింది. నిర్మాణ వ్యయాలు ఎగబాకడం, రుణ రేట్లు పెరగడం, దేశీయంగా, అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2022-23లో స్థిరాస్తి రంగం పురోగమించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. మందగమనం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు స్వల్పకాలంలో గిరాకీని దెబ్బతీసినట్లు పేర్కొంది. అయితే, రానున్న రోజుల్లో గిరాకీ క్రమంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2023-24లో ఇళ్ల విక్రయాలు 9 శాతం పుంజుకుంటాయని అంచనా వేసింది. పెరుగుతున్న వ్యయాలతో డెవలపర్లపై భారం పడుతోందని తెలిపింది. అయినప్పటికీ.. వారు వచ్చే 6-7 నెలల పాటు దాన్ని పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేసే పరిస్థితులు లేవని పేర్కొంది. ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని వివరించింది. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే కొంత వరకు ధరల్ని పెంచక తప్పలేదని తెలిపింది. దీంతో అందుబాటు ధరలో ఉండే ఇళ్లకు గిరాకీ తగ్గిందని పేర్కొంది. దీనికి వడ్డీ రేట్ల పెంపు కూడా జత కావడంతో సెంటిమెంటు మరింత బలహీనంగా ఉందని వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..