పెరిగిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం

విమానాశ్రయాలు, మౌలిక వసతుల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,894.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

Published : 28 May 2023 01:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయాలు, మౌలిక వసతుల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,894.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర నష్టం రూ.636.74 కోట్లుగా ఉంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.1,283.60 కోట్లు, నికర నష్టం రూ.128.95 కోట్లుగా నమోదయ్యాయి. వీటితో పోలిస్తే సమీక్షా త్రైమాసికంలో ఆదాయంతోపాటు, నష్టాలూ పెరిగాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.6,693.40 కోట్ల ఆదాయం, రూ.839.93 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.4,600.72 కోట్లు, నికర నష్టం రూ.752.31 కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని