పాన్‌ చెల్లుబాటులో లేదా?

ఆధార్‌తో అనుసంధానించక పోవడం వల్ల పాన్‌ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం సూచించింది.

Published : 19 Jul 2023 08:12 IST

పన్ను అధికారులను సంప్రదించండి
ఎన్నారైలకు ఐటీ విభాగం సూచన

దిల్లీ: ఆధార్‌తో అనుసంధానించక పోవడం వల్ల పాన్‌ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం సూచించింది. పలువురు ఎన్నారైలు తమ పాన్‌ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఐటీ విభాగం ట్విటర్‌లో స్పందించింది. ఎన్నారైలు/ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) వారి పాన్‌ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు అందులో పేర్కొంది. ఎన్నారైలు గత మూడు మదింపు సంవత్సరాల్లో ఏదైనా ఏడాది రిటర్నులు దాఖలు చేసినా, లేదా వారి నివాస స్థితిని తెలియజేసినా దాన్ని పాన్‌కు మ్యాప్‌ చేసినట్లు తెలిపింది. తమ నివాస స్థితిని తెలియజేయని ఎన్నారైల పాన్‌లు మాత్రమే పనిచేయడం లేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు తమ నివాస స్థితిని తెలియజేస్తూ సంబంధిత పన్ను మదింపు అధికారి (జేఏఓ)ని సంప్రదించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు