ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్నుతో రూ.20,500 కోట్ల పెట్టుబడులు వెనక్కి

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్ను విధించాలన్న జీఎస్‌టీ మండలి నిర్ణయంతో, ఈ రంగం నుంచి 2.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.20,500 కోట్ల) పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయని పలువురు పెట్టుబడిదార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 22 Jul 2023 11:35 IST

ప్రధాని మోదీకి పెట్టుబడిదార్ల లేఖ

దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్ను విధించాలన్న జీఎస్‌టీ మండలి నిర్ణయంతో, ఈ రంగం నుంచి 2.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.20,500 కోట్ల) పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయని పలువురు పెట్టుబడిదార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 30 మంది భారత, విదేశీ పెట్టుబడిదార్లు రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. జీఎస్‌టీ మండలి తీసుకున్న నిర్ణయం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని, భారత టెక్‌ పరిశ్రమపై మదుపర్ల విశ్వాసం తగ్గేందుకు ఇది కారణమయ్యే ప్రమాదముందని ఆ లేఖ పేర్కొంది.  మోదీకి లేఖ రాసిన పెట్టుబడిదార్లలో పీక్‌ ఎక్స్‌వీ క్యాపిటల్‌, టైగర్‌ గ్లోబల్‌, డీఎస్‌టీ గ్లోబల్‌, బెనెట్‌, కోల్‌మన్‌ అండ్‌ కంపెనీ, ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌, క్రిస్‌ క్యాపిటల్‌, లుమికయ్‌ వంటివి ఉన్నాయి. జీఎస్‌టీ మండలి నిర్ణయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం సహకరిస్తే, వచ్చే 3-4 ఏళ్లలో ఈ రంగంలోకి 4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 32,800 కోట్ల) పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి.

రిఫండ్‌ పోర్టల్‌పై 5 లక్షల మంది సహారా మదుపర్లు: సహారా గ్రూప్‌నకు చెందిన సహకార సంఘాల నుంచి డిపాజిట్‌ల రిఫండ్‌ కోసం తీసుకొచ్చిన పోర్టల్‌పై దాదాపు 5 లక్షల మంది మదుపర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కేంద్ర సహకార మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. మదుపర్లకు నగదు వెనక్కి ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని