సూపర్‌ యాప్‌గా ‘ఎక్స్‌’!

టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చి, పక్షి స్థానంలో కొత్త లోగో ఎక్స్‌ను తీసుకొచ్చారు.

Published : 26 Jul 2023 02:21 IST

టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చి, పక్షి స్థానంలో కొత్త లోగో ఎక్స్‌ను తీసుకొచ్చారు. సామాజిక మాధ్యమంగా, మెసేజ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా కాకుండా ఆర్థిక లావాదేవీలు సహా పలు రకాల సేవలు అందించే ‘ఎవ్రీథింగ్‌ యాప్‌గా’ దీనిని తీర్చిదిద్దడమే మస్క్‌ లక్ష్యం. ‘వాక్‌ స్వాతంత్య్రానికి వేదికగా మార్చేందుకే ట్విటర్‌ను ఎక్స్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసింది. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విటర్‌ అనే పేరు సరిపోతుంది. ప్రస్తుతం ఎక్స్‌లో పెద్ద సైజున్న వీడియోలూ షేర్‌ చేయొచ్చు. ఇంకొన్ని కీలక మార్పులూ చోటుచేసుకోబోతున్నాయి. వినియోగదార్లు తమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించే సౌలభ్యాన్నీ తీసుకు రానున్నాం. తద్వారా ఎక్స్‌ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చబోతున్నాం. అందుకే ఇప్పుడు ట్విటర్‌ పేరు సరిపోదు’ అని మస్క్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని