3 రోజుల వరుస లాభాలకు విరామం

సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

Published : 27 Mar 2024 01:16 IST

సమీక్ష

సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 32 పైసలు పుంజుకుని 83.29 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 86.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 72,396.97 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 72,363.03 వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 361.64 పాయింట్లు కోల్పోయి 72,470.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.05 పాయింట్లు తగ్గి 22,004.70 దగ్గర స్థిరపడింది.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ 2.07%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.60%, విప్రో 1.50%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.11%, కోటక్‌ బ్యాంక్‌ 1.11%, ఇన్ఫోసిస్‌ 1.09%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.01%, టీసీఎస్‌ 0.92%, టెక్‌ మహీంద్రా 0.90% డీలాపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.18%, ఎల్‌ అండ్‌ టీ 1.38%, ఎన్‌టీపీసీ 1.31%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.69% వరకు లాభపడ్డాయి. నీ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కెనడాకు 90.8 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.755 కోట్ల) బకాయిలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ తెలిపింది. 2011లో 15 విమానాలు కొనుగోలు చేసేందుకు కంపెనీ ఈ రుణం తీసుకుంది. 
  • భారతీ హెగ్జాకామ్‌ ఐపీఓ ఏప్రిల్‌ 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.542- 570 నిర్ణయించారు.
  • గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ ఐఎఫ్‌ఎస్‌సీ బ్యాంకింగ్‌ యూనిట్‌లో ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కోసం డిజిటల్‌ అమెరికా డాలర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను తీసుకొచ్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఇది నిర్వహించుకోవచ్చని వివరించింది.
  • బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఔషధ కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఫార్మాలో 2.9% వాటాను రూ.2,469 కోట్లకు క్రిస్‌క్యాపిటల్‌ విక్రయించింది. క్రిస్‌క్యాపిటల్‌కు చెందిన బీజే లిమిటెడ్‌, 1.16 కోట్ల మ్యాన్‌కైండ్‌ షేర్లను రెండు విడతల్లో అమ్మింది.
  • 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు రూ.178 కోట్ల జీఎస్‌టీ చెల్లించాల్సిందిగా డిమాండ్‌ నోటీసు అందుకున్నట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది.
  • ల్యాంకో అమర్‌కంటక్‌ పవర్‌ను కొనుగోలు చేయాలన్న అదానీ పవర్‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) మంగళవారం ఆమోదం తెలిపింది. ల్యాంకో అమర్‌కంటక్‌ పవర్‌లో 100% షేర్‌ క్యాపిటల్‌, నియంత్రణను దక్కించుకోవాలని అదానీ పవర్‌ చూస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని