హెచ్‌పీసీఎల్‌ 2 షేర్లకు 1 షేరు బోనస్‌

హెచ్‌పీసీఎల్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం         రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ.

Published : 10 May 2024 02:38 IST

25% తగ్గిన నికర లాభం
తుది డివిడెండ్‌ రూ.16.50

దిల్లీ: హెచ్‌పీసీఎల్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం         రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. ఇదే సమయంలో టర్నోవర్‌ మాత్రం రూ.1.15 లక్షల కోట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగింది. ప్రతి బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 6.95 డాలర్ల ఆదాయం ఆర్జించింది. 2022-23 మార్చి త్రైమాసికంలో ఇది 14.01 డాలర్లు, 2023-24 డిసెంబరు త్రైమాసికంలో 8.50 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను లీటరుకు రూ.2 తగ్గించడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ తెలిపింది.

  • హెచ్‌పీసీఎల్‌ ప్రతి 2 షేర్లకు 1 షేరు బోనస్‌ (1:2 నిష్పత్తిలో) ప్రకటించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపింది. వాటాదార్ల అనుమతి పొందాల్సి ఉంది.
  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,014.61 కోట్ల నికర లాభాన్ని సంస్థ ఆర్జించింది. 2022-23లో రూ.6,980.23 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి విదితమే. కార్యకలాపాల ఆదాయం రూ.4,66,192 కోట్ల నుంచి రూ.4,61,638 కోట్లకు తగ్గింది. సగటు స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎం) 12.09 డాలర్ల నుంచి 9.08 డాలర్లకు తగ్గింది.
  • రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.16.50 (బోనస్‌కు ముందు), రూ.11 (బోనస్‌ తర్వాత) తుది డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని