ఏషియన్‌ పెయింట్స్‌ తుది డివిడెండ్‌ 2815%

ఏషియన్‌ పెయింట్స్‌, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 10 May 2024 02:37 IST

దిల్లీ: ఏషియన్‌ పెయింట్స్‌, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.1,258.41 కోట్లతో పోలిస్తే ఇది  1.34% ఎక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.8,787.34 కోట్ల నుంచి రూ.8,730.76 కోట్లకు తగ్గింది. మొత్తం వ్యయాలు రూ.7,181.66 కోట్ల నుంచి రూ.7,319.1 కోట్లకు పెరిగాయి.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.4,195.33 కోట్ల నుంచి రూ.5,557.69 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.34,488.59 కోట్ల నుంచి రూ.35,494.73 కోట్లకు చేరింది.
  • రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.28.15 (2,815%) తుది డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. 2023 అక్టోబరులో ప్రకటించిన రూ.5.15 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. అంటే మొత్తం డివిడెండ్‌ రూ.33.30కు చేరింది.
  • 2023-24లో రూ.35,000 కోట్ల ఏకీకృత ఆదాయం మైలురాయిని అధిగమించామని ఏషియన్‌ పెయింట్స్‌ ఎండీ, సీఈఓ అమిత్‌ సింగ్లే వెల్లడించారు. డెకరేటివ్‌, పారిశ్రామిక కోటింగ్స్‌ల సంయుక్త పరిమాణ వృద్ధి 10%, విలువ వృద్ధి 3.9%, పారిశ్రామిక విభాగ విలువ వృద్ధి రెండంకెల స్థాయికి పెరిగినట్లు తెలిపారు. అంతర్జాతీయ వ్యాపారమూ స్థిర వృద్ధితో కొనసాగుతోందని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని