బీపీసీఎల్‌ బోనస్‌ షేరు

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) బోనస్‌ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది.

Published : 10 May 2024 02:38 IST

రికార్డు వార్షిక లాభం నమోదు
త్రైమాసిక లాభంలో 30% క్షీణత
తుది డివిడెండు రూ.21

దిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) బోనస్‌ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. తక్కువ రిఫైనింగ్‌ మార్జిన్‌ కారణంగా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.4,789.57 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే కాల లాభం రూ.6,870.47 కోట్లతో పోలిస్తే ఇది 30% తక్కువ. కంపెనీ టర్నోవరు రూ.1.34 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు తగ్గింది.

2023-24కు: పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ రికార్డు స్థాయిలో రూ.26,858.84 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022-23 లాభం రూ.2,131.05 కోట్లే. ప్రతి బారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 14.14 డాలర్లను కంపెనీ సంపాదించింది. 2022-23లో ఇది 8.83 డాలర్లే ఉంది.  2023-24 కు తుది డివిడెండు రూ.21 (బోనస్‌కు ముందు)ను బోర్డు సిఫారసు చేసింది. బోనస్‌ అనంతరం అయితే ఇది రూ.10.5 అవుతుంది.

ఇదీ కార్యాచరణ: ప్రస్తుత 35.3 మిలియన్‌ టన్నుల రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని 2028-29 కల్లా 45 మి.టన్నులకు చేర్చుకోవడంతో పాటు, 4,000 కొత్త పెట్రోల్‌బంకులను తెరవాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉందని సీఎండీ జి.కృష్ణకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం మొత్తం 21,840 పెట్రోలు పంపులు, 2031 సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నాయి. అయిదేళ్ల కాలానికి రూ.1.7 లక్షల కోట్ల మూలధన కేటాయింపు వల్ల, దీర్ఘకాలంలో వాటాదార్లకు మంచి విలువ దక్కుతుందన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని