Maruti Fronx: వచ్చే వారంలో మార్కెట్‌లోకి మారుతీ ఫ్రాంక్స్‌.. ధరెంతో తెలుసా?

మారుతీ సుజుకీ తమ కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ఫ్రాంక్స్‌ను వచ్చే వారంలో దేశీయ విపణిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Updated : 11 Apr 2023 09:34 IST

దిల్లీ: మారుతీ సుజుకీ తమ కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ఫ్రాంక్స్‌ను వచ్చే వారంలో దేశీయ విపణిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో-2023లో సంస్థ తొలిసారిగా ప్రదర్శించింది. ఈ వాహనాల ధరల శ్రేణి రూ.8-14 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉండొచ్చని సమాచారం. మారుతీ హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో ఆధారంగా తీసుకొచ్చిన ఫ్రాంక్స్‌ పొడవు కూడా, పన్ను ప్రయోజనాల రీత్యా 4 మీటర్ల కంటే తక్కువే ఉంటుందని సమాచారం.

* ప్రీమియం ఆడియో సిస్టమ్‌, 9-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, సన్‌రూఫ్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, హెడ్స్‌-అప్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల పార్కింగ్‌ కెమేరా, రేర్‌ ఏసీ వెంట్స్‌, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పుష్‌ బటన్‌ (స్టార్ట్‌-స్టాప్‌) తదితర ఫీచర్లు ఫ్రాంక్స్‌ మోడళ్లలో ఉంటాయని తెలుస్తోంది.
* ఫ్రోంక్స్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో 5 వేరియంట్లు ఉన్నాయి. అవి సిగ్మా, డెల్టా, డెల్టా+, ఆల్ఫా, జెటా. 6 మోనోటోన్‌ రంగుల ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. బ్లూ, ఆర్క్‌టిక్‌ వైట్‌, ఓపులెంట్‌ రెడ్‌, స్ల్పెండిడ్‌ సిల్వర్‌, గ్రాన్‌డ్యూర్‌ గ్రే, ఎర్తర్న్‌ బ్రౌన్‌. డ్యూయల్‌ టోన్‌ ఆప్షన్లలో ఓపులెంట్‌ రెడ్‌-బ్లూయిష్‌ బ్లాక్‌, స్ల్పెండిడ్‌ సిల్వర్‌-బ్లూయిష్‌ బ్లాక్‌, ఎర్తర్న్‌ బ్రౌన్‌-బ్లూయిష్‌ బ్లాక్‌ ఉన్నాయి.
* ఫ్రాంక్స్‌ రెండు రకాల ఇంజిన్‌ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇందులో 1-లీటరు బూస్టర్‌జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఒక రకం కాగా, కె-సిరీస్‌ పెట్రోల్‌ మోటార్‌ అసిస్టెడ్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ రెండో రకం ఇంజిన్‌. నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, హోండా డబ్ల్యూఆర్‌-వీ, టాటా నెక్సాన్‌, రెనో కైగర్‌, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ఇతర కంపెనీ మోడళ్లతో ఫ్రాంక్స్‌ విపణిలో పోటీ పడబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని