HCL Results: హెచ్‌సీఎల్‌ లాభం ₹3,534 కోట్లు

HCL Q1 Results: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 7 శాతం వృద్ధితో రూ.3,534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Published : 12 Jul 2023 20:03 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (HCL Q1 Results) బుధవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ రూ.3,534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభం 7 శాతం పెరిగింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం క్షీణించడం గమనార్హం. జనవరి- మార్చి త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.3,983 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది.

సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.26,296 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 12.1 శాతం మేర పెరగ్గా.. క్రితం త్రైమాసికంతో పోల్చినప్పుడు 1.2 శాతం మేర క్షీణించింది. సమీక్షా త్రైమాసికంలో 18 పెద్ద డీల్స్‌ అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 7 సేవలకు సంబంధించినవి కాగా.. 11 సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినవని కంపెనీ తెలిపింది. షేర్‌ హోల్డర్లకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించేందుకు బోర్డు నిర్ణయించింది. జులై 20ని రికార్డు డేట్‌గా కంపెనీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని