HDFC Bank: లక్షద్వీప్‌లో తొలి ప్రైవేటు బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ

HDFC Bank: లక్షద్వీప్‌లో పర్యటకం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అక్కడ తమ బ్రాంచ్‌ను తెరిచింది.

Updated : 11 Apr 2024 12:49 IST

కవరత్తీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) లక్షద్వీప్‌లోని కవరత్తీ ద్వీపంలో తొలి శాఖను ప్రారంభించింది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బ్రాంచిని ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు బ్యాంకుగా నిలిచింది. మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌ (Lakshadweep) పర్యటక స్థలంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అక్కడ పర్యటకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ తరుణంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ శాఖను ప్రారంభించడం గమనార్హం.

పర్సనల్‌, డిజిటల్‌ బ్యాకింగ్‌ సహా కస్టమర్లకు వివిధ రకాల సేవలను అందిస్తూ ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో (Lakshadweep) సేవలను మెరుగుపరుస్తామని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) తెలిపింది. రిటైలర్లకు క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత లావాదేవీలను సైతం అందిస్తామని వెల్లడించింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ పర్యటక ప్రదేశాలన్నింటిలో హెచ్‌డీఎఫ్‌సీ శాఖలున్నాయి. 2023 డిసెంబర్‌ 31 నాటికి ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 8,091 బ్రాంచీలున్నాయి. వీటిలో 52 శాతం సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 3,872 నగరాల్లో 20,688 ఏటీఎంలను నిర్వహిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని