Carbon Fibre: T100 కార్బన్‌ ఫైబర్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్న భారత్‌

భారత్‌, వచ్చే రెండున్నర ఏళ్లలో ‘T100’ కార్బన్‌ ఫైబర్‌ ఉత్పత్తిని ప్రారంభించనుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సరస్వత్‌ గురువారం తెలిపారు.

Published : 09 May 2024 22:11 IST

భారత్‌.. రాబోయే రెండున్నరేళ్లలో T100 రకం కార్బన్‌ ఫైబర్‌ తయారీ ప్రారంభించనుంది. ఈ కార్బన్‌ ఫైబర్‌ను.. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ రంగాలతో పాటు హైడ్రోజన్‌ సిలిండర్లు, క్షిపణులు, లాంచ్‌ వెహికల్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, బ్రిడ్జిల నిర్మాణం వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(BARC), హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(HAL), MIDHANI.. భారత్‌లో కార్బన్‌ ఫైబర్‌ తయారీని ప్రారంభించే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నాయని వీకే సరస్వత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని