stock market : నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

బుధవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Published : 16 Aug 2023 09:38 IST

ముంబయి :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ(stock market)లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌(Sensex) 300 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ(Nifty) 19,350 దిగువన కదలాడింది. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్‌ 222 పాయింట్లు నష్టపోయి 65,179 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో 19,354 వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్ల ప్రధాన సూచీలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. 

నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టపోతుండగా.. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని