Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్టు

మనీలాండరింగ్‌ కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్టు అయ్యారు. శుక్రవారం సుదీర్ఘంగా విచారించిన ఈడీ అనంతరం ఆయనను అరెస్టు చేసింది.  

Updated : 02 Sep 2023 01:06 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌(74) అరెస్టు అయ్యారు. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(PMLA) ప్రకారం గోయల్‌ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయిలోని ఈడీ కార్యాలయంలో నరేశ్‌ గోయల్‌ను శుక్రవారం సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పీఎంఎల్‌ఏ కోర్టులో శనివారం గోయల్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గోయల్‌ కస్టోడియల్‌ రిమాండ్‌ను కోరేందుకు ఈడీ సిద్ధమవుతోంది. 

కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసగించిన కేసులో గోయల్‌, ఈయన భార్య అనితా, కంపెనీకి చెందిన ఇతర అధికారులపై సీబీఐ తొలుత కేసు నమోదు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గత జులై 20న గోయల్‌, ఆయన భార్య అనిత, కంపెనీకి చెందిన ఇతర అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. దీంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. జులై 29న 2021న జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు సీబీఐ తేల్చింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు