Maruti Suzuki: అదరగొట్టిన మారుతీ సుజుకీ.. లాభం 80% జంప్‌

Maruti suzuki Q2 results: మారుతీ సుజుకీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 80 శాతం వృద్ధితో రూ.3716 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Published : 27 Oct 2023 16:49 IST

Maruti Suzuki | దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై -సెప్టెంబర్‌ త్రైమాసికంలో (Q2 results) అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. మొత్తం రూ.3,716 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 80.3 శాతం అధికం. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2061.5 కోట్లుగా ఉంది. అమ్మకాల్లో వృద్ధి, ఆపరేటింగ్‌యేతర ఆదాయాలు పెరగడం, కమొడిటీ ధరలు తగ్గడం వంటి కారణాలతో భారీ లాభాలను నమోదు చేయగలిగింది.

Nokia 105 Classic: యూపీఐ ఫీచర్‌తో నోకియా 105 క్లాసిక్‌ ఫోన్‌

మారుతీ సుజుకీ మొత్తం ఆదాయం సైతం భారీగా పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో గతేడాది రూ.28,543.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.35,535.1 కోట్లకు పెరిగింది. సంఖ్యాపరంగా చూస్తే గతేడాది రెండో త్రైమాసికంలో 5,17,395 యూనిట్లు మారుతీ సుజుకీ విక్రయించగా.. ఈ సారి 5,52,055 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 4,82,71 యూనిట్లు దేశీయంగా విక్రయించగా.. 69,324 వాహనాలు విదేశీ మార్కెట్లలో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఒక త్రైమాసికంలో విక్రయాల పరంగా ఇదే అత్యధికమని, లాభాల పరంగానూ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించామని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకీ షేరు శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఓ దశలో 4 శాతం మేర పెరిగింది. చివరికి 1 శాతం లాభంతో రూ.10,535 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని