Satya Nadella: ‘రాత్రంతా మేల్కొని ఉన్నా’.. భారత్‌ vs కివీస్‌ మ్యాచ్‌పై సత్య నాదెళ్ల

Satya Nadella: బుధవారం జరిగిన భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను కోట్లాది మంది వీక్షించారు. వీరిలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు.

Updated : 16 Nov 2023 12:08 IST

వాషింగ్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) సెమీఫైనల్‌ను యావత్‌ దేశం ఆసక్తిగా తిలకించింది. భారత్‌ ఇటు బ్యాటింగ్‌తో పాటు, అటు బౌలింగ్‌లోనూ అద్భుతమైన ఆటతీరు కనబర్చి విజయాన్ని ముద్దాడిన తీరును చూసి కోట్లాది మంది సంబరాలు చేసుకొన్నారు. అయితే, బుధవారం టీవీ స్క్రీన్‌కు అతుక్కుపోయిన క్రికెట్‌ ఫ్యాన్స్‌లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సైతం ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేసి వచ్చిన తర్వాత పూర్తిగా మ్యాచ్‌లో మునిగిపోయినట్లు సత్య నాదెళ్ల తెలిపారు. మొత్తానికి రాత్రంతా మేల్కొని ఉన్నట్లు చెప్పారు. ఇగ్నైట్‌ పేరిట నిర్వహించిన కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్‌ చేసినప్పుడు తమకు మ్యాచ్‌ జరుగుతుందనే విషయంపై పెద్దగా అవగాహన లేదన్నారు. ఎట్టకేలకు రాత్రంతా మేల్కొని మ్యాచ్‌ను సైతం వీక్షించినట్లు తెలిపారు. భారత జట్టు గెలుపుపై సంతోషం వ్యక్తం చేశారు.

టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబయి వేదికగా జరిగిన సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. విరాట్‌, శ్రేయస్‌ శతకాలు బాదడంతో మొదట భారత్‌ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, రాహుల్‌ కూడా అదరగొట్టారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షమి (7/57) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో లక్ష్య ఛేదనలో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌటైంది. మిచెల్‌, విలియమ్సన్‌ పోరాడారు. టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని