Stock Market: వరుసగా నాలుగోరోజూ నష్టాలు.. 18,550 చేరువకు నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాల్లో ముగిశాయి.

Updated : 07 Dec 2022 15:57 IST

ముంబయి: రేట్ల పెంపు, వృద్ధి అంచనాల్లో కోత వంటి ఆర్‌బీఐ ప్రకటనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. ఆర్‌బీఐ ద్వైమాసిక నిర్ణయాల ప్రకటన తర్వాత క్రమంగా కిందకు దిగజారాయి. దీంతో వరుసగా నాలుగోరోజూ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ద్రవ్యోల్బణం మరికొంత కాలం కొనసాగనుందన్న ఆర్‌బీఐ వ్యాఖ్యలూ మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సైతం సూచీలను కిందకు లాగాయి.

చివరకు సెన్సెక్స్‌ 215.68 పాయింట్ల నష్టంతో 62,410.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు నష్టపోయి 18,560.50 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.46 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌30 సూచీలో 07 షేర్లు లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని