Ola : ఓలాలో కుక్కకు ఉద్యోగం.. ఐడీ కార్డు పోస్టు చేసిన సీఈవో

ఓ కుక్కకు ఉద్యోగం కల్పించినట్లు ఓలా (Ola) సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. సరదాగా ఉన్న ఆ ఐడీ కార్డు (ID card) వివరాలను పోస్టు చేశారు. 

Published : 01 Aug 2023 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఓలాలో (Ola)  ‘బిజిలీ’ అనే కుక్కకు ఉద్యోగ అవకాశం కల్పించినట్లు ఆ సంస్థ సీఈవో భవీశ్‌ అగర్వాల్ (Bhavish Aggarwal) తెలిపారు. అందుకు సంబంధించిన గుర్తింపు కార్డును ఆయన ట్విటర్‌లో (Twitter) పోస్టు చేశారు. హిందీలో ‘బిజిలీ’ అంటే విద్యుత్తు అనే అర్థం వస్తుంది. అలాగే ఉద్యోగి గుర్తింపు సంఖ్యను ‘440 వీ’గా పేర్కొన్నారు. ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌లో ప్రామాణికంగా వినియోగించే ఓల్టేజీని ఇలా సరదాగా సూచించారు. బ్లడ్ గ్రూప్‌ ‘PAW +ve’గా పేర్కొన్నారు. దానిపై ఓలా ఎలక్ట్రిక్స్‌ బెంగళూరు కార్యాలయం చిరునామా ముద్రించారు. కొరమంగళ శాఖలో భవీశ్‌ అగర్వాల్‌ కార్యాలయంలో ఆ కుక్క పనిచేస్తుందని వివరంగా రాశారు. దానికి మరింత ఫన్ జోడిస్తూ బిజిలీని ‘స్లాక్’ ద్వారా సహోద్యోగులు కమ్యూనికేట్‌ చేయొచ్చని వెల్లడించారు. 

ఐటీఆర్‌ డెడ్‌లైన్‌ మిస్‌ అయ్యారా? ఇప్పటికీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయొచ్చు..

ఈ పోస్టు చూసిన నెటిజన్లు బిజిలీకి అభినందనలు తెలుపుతున్నారు. కొందరు దానిని యానిమేటెడ్ క్యారెక్టర్‌ ‘బోల్ట్‌’తో పోల్చారు. ఓలా ఇటీవలే తమ ‘ఎస్‌1 ఎయిర్‌’ స్కూటర్‌ కొనుగోలుపై రూ.10 వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31 రాత్రి నుంచి ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎస్‌ 1 ఎయిర్‌లో 3 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 125 కిలోమీటర్ల రేంజ్‌ వస్తుంది. గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని