OpenAI: చాట్‌జీపీటీ సరికొత్త వెర్షన్‌.. వీరి కోసం మాత్రమే...

OpenAI: చాట్‌జీపీటీ సరికొత్త వెర్షన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ కొత్త వెర్షన్‌తో వినియోగదారులు తమ డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని  తెలిపింది.

Updated : 29 Aug 2023 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందించిన చాట్‌బాట్‌ (chatbot)రేసుల్లో చాట్‌జీపీటీ (ChatGPT) ప్రముఖమైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిదే హవా.. ప్రతి రోజు మిలియన్ల మంది యూజర్లు దీని సేవలు వినియోగించుకుంటున్నారు. అటు వ్యక్తిగత అవసరాలకు, ఇటు వృత్తిపరమైన పనుల్లోనూ దీనిని భాగస్వామ్యం చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ చాట్‌బాట్‌ వ్యాపారస్థులకు కొత్త తరహా సేవల్ని అందించే పనిలోపడింది.  వీరి కోసం అత్యంత శక్తిమంతమైన ప్రైవేటు వెర్షన్‌ తీసుకొచ్చింది.  చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్‌ (ChatGPT Enterprise) పేరుతో ఈ వెర్షన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

ప్రస్తుతం ఉన్న చాట్‌జీపీటీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక రకాల సేవల్ని అందిస్తోంది. అయినప్పటికీ  చాలా మంది తమ డేటా భద్రత పట్ల ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా ఈ కొత్త వెర్షన్‌ తీసుకొచ్చినట్లు చాట్‌జీపీటీ తెలిపింది.  వ్యాపారస్థుల మెరుగైన గోప్యత, భద్రతను అందించటానికి ఇది సహాయపడుతుందని పేర్కొంది. సృజనాత్మకంగా, మెరుగైన ఫలితాల్ని అందించటంతో ఉద్యోగులకు అన్ని విధాలా తోడుగా ఉంటుందని తెలిపింది. అయితే ఈ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్‌ ఈ రోజు నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

తొలి ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ కారు.. భారత్‌లో విడుదల చేసిన కేంద్ర మంత్రి

ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ సెక్యూరిటీ అండ్‌ ప్రైవసీ, GPT-4 ప్రాసెసింగ్ ఇంజిన్‌కి అపరిమిత యాక్సెస్, అధునాతన డేటా విశ్లేషణ సామర్థ్యాలు.. ఈ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్‌ సాధారణ చాట్‌బాట్‌ కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. నాలుగు రెట్లు వేగంగా ఫైల్స్‌ను ప్రాసెస్‌ చేయటానికి అనుమతిస్తుంది. దీనికున్న అధునాతన డేటా విశ్లేషణ ద్వారా సెకన్లలో సమాచారాన్ని అందిస్తుంది. ఈ కొత్త వెర్షన్‌తో వినియోగదారులు తమ డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని  తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని