Jio Mart: జియో మార్ట్‌కు ప్రచారకర్తగా ధోని

దేశీయ ఈ-కామర్స్ సంస్థ జియో మార్ట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. 

Updated : 06 Oct 2023 19:53 IST

ముంబయి: రిలయన్స్ రిటైల్‌ (Reliance Retail)కు చెందిన ఈ-కామర్స్‌ (e-Commerce) రిటైల్‌ స్టోర్‌ జియో మార్ట్‌ (Jio Mart)కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని (MS Dhoni) ప్రచారకర్తగా వ్యవహరింనున్నారు. ఈ మేరకు రిలయన్స్‌ రిటైల్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా పండుగ సీజన్‌లో వినియోగదారుల కోసం జియో ఉత్సవ్‌ (Jio Utsav) పేరుతో అక్టోబరు 8 ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం ధోనితో 45 సెకన్ల నిడివితో ప్రత్యేక ప్రచార వీడియోను రూపొందించారు. ‘‘ఎన్నో సందర్భాల్లో దేశం సంబరాలు చేసుకునేందుకు ధోని అవకాశం కల్పించాడు. ఈ వీడియోలో ఆయన పండుగ సంబరాలు చేసుకుంటూ కనిపిస్తాడు’’ అని జియో ప్రకటనలో పేర్కొంది.

‘‘దేశీయ రిటైల్‌ రంగానికి బలపరచాలని, స్థానిక వ్యాపారులకు మద్దతుగా జియో మార్ట్‌ను ప్రారంభించారు. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చెందిన ఈ-కామర్స్ స్టోర్‌. భారత్‌లో పండుగలు ఎంతో ప్రత్యేకం. జియో ఉత్సవ్‌ ఈ సారి తప్పకుండా భారతీయలు పండుగలను మరింత ఆనందమయం చేస్తుంది. ఇందులో నేను కూడా భాగాస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని ధోని తెలిపాడు. పండుగ సీజన్‌ కోసం రూపొందించిన ప్రకటన వీడియోలో జియో మార్ట్‌లోని డిస్కౌంట్‌, షాపింగ్ డీల్స్ గురించి వివరించినట్లు కంపెనీ సీఈవో సందీప్‌ వరగంటి తెలిపారు. జియో మార్ట్‌లో అర్బన్‌ లాడర్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌, రిలయన్స్ జ్యూయెల్స్‌ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని