Retail inflation: స్థిరంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.09%

Retail inflation: ఫిబ్రవరి నెలకు సంబంధించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను ఎన్‌ఎస్‌ఓ మంగళవారం వెల్లడించింది.

Published : 12 Mar 2024 19:35 IST

దిల్లీ: వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) ఫిబ్రవరి నెలలో 5.09 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో 5.1 శాతంగా నమోదైంది. అంటే రిటైల్‌ ద్రవ్యోల్బణంలో పెద్దగా మార్పు లేదు. 2023 ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా ఉందని కేంద్ర గణాంక కార్యాలయం (NSO) ప్రకటించింది.  ఈ ఏడాది జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.66 శాతానికి చేరింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (2023-24)లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా నమోదు కావొచ్చని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గత నెలలో అంచనా వేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచే బాధ్యతను ప్రభుత్వం ఆర్‌బీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులను బట్టి ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతూ వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని