R K SWAMY IPO: ఆర్‌కే స్వామి ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే

R K SWAMY IPO: రూ.రూ.423.56 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ ఐపీఓ ప్రారంభమైంది.

Published : 04 Mar 2024 12:24 IST

R K SWAMY IPO | ముంబయి: ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ ఐపీఓ (R K SWAMY IPO) సోమవారం ప్రారంభమైంది. మార్చి 6 వరకు షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.270-288గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.423.56 కోట్లు సమీకరించనుంది. రూ.173 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. రూ.250.56 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచారు. రిటైల్‌ మదుపర్లు కనీసం రూ.14,400తో 50 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ ఐపీఓ (IPO)లో సమీకరించిన నిధులతో డిజిటల్‌ వీడియో కంటెంట్‌ ప్రొడక్షన్‌ స్టూడియో, కొత్త కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌, కంప్యూటర్‌ ఆధారిత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ తెలిపింది. మిగతా వాటిని సాధారణ కార్పొరేట్‌ అవసరాలు, ఐటీ మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పింది.

ఆర్‌కే స్వామి లిమిటెడ్‌ క్రియేటివ్‌ మీడియా, డేటా అనలిటిక్స్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ వంటి సేవలను అందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో తమ క్లయింట్లకు దాదాపు 818 ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. 2.37 మిలియన్ల ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, మోతీలాల్ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: మార్చి 4-6
  • ధరల శ్రేణి: రూ.270-288
  • షేరు ముఖ విలువ: రూ.5
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 50 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,400
  • అలాట్‌మెంట్ తేదీ: మార్చి 7
  • రిఫండ్‌ తేదీ: మార్చి 11
  • లిస్టింగ్‌ తేదీ: మార్చి 12
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని