Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్‌ సూచీలు ఈ వారం లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 

Published : 24 Apr 2023 09:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.31 సమయంలో సెన్సెక్స్‌ 86 పాయింట్లు పెరిగి 59,741 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకొని 17,650 వద్ద కొనసాగుతున్నాయి. హెచ్‌ఎల్‌ఈ గ్లాస్‌కోట్‌, మిర్జా ఇంటర్నేషనల్‌, రేమాండ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైప్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లాభాల్లో ఉండగా.. బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, రాజ్‌రతన్‌ గ్లోబల్‌ వైర్‌, ఎఫ్‌డీసీ, ఈకెఐ ఎనర్జీ సర్వీసెస్‌, హింద్‌ జింక్‌ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకొని 82.070 వద్ద కొనసాగుతోంది.

ఇక శుక్రవారం మార్కెట్‌ ముగిసిన అనంతరం రికార్డు స్థాయి లాభాన్ని ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రభావం నేపథ్యంలో సూచీలు సానుకూలంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా-పసిఫక్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. జపాన్‌ సూచీ నిక్కీ 0.37 పెరగ్గా.. ఆస్ట్రేలియా సూచీ ఎస్‌అండ్‌పీ ఏఎస్‌ఎక్స్‌ ప్రతికూలంగా ట్రేడవుతోంది. మరోవైపు దక్షిణకొరియా సూచీ కేవోఎస్పీఐ కూడా 0.5శాతం కుంగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని