Stock Market : నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఈ వారం రెండో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.

Updated : 06 Dec 2022 10:40 IST

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు(Stock Market) నేడు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు సుదీర్ఘకాలం కొనసాగించనుందనే  అంచనాలతో యూఎస్‌ సూచీలు నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా పతనమయ్యాయి. ఆర్‌బీఐ (RBI) ద్రవ్యపరపతి విధాన సమీక్షకు ముందు మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ ప్రభావం దేశీయ సూచీలపై పడింది. ఈ నేపథ్యంలో ఉదయం 9.37 గంటలకు సెన్సెక్స్‌(Sensex) 347 పాయింట్లు నష్టపోయి 62,483 వద్ద.. నిఫ్టీ( Nifty) 100 పాయింట్లు క్షీణించి 18,600 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.38గా నమోదైంది.

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని