Swiggy: ఇన్‌స్టామార్ట్‌తో స్విగ్గీ మాల్‌ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ

Swiggy: క్విక్‌- కామర్స్‌ విభాగమైన ఇన్‌స్టామార్ట్‌ను స్విగ్గీ మాల్‌తో అనుసంధానం చేసినట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ గురువారం తెలిపింది.

Published : 18 Apr 2024 17:38 IST

Swiggy | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) తన క్విక్‌- కామర్స్‌ విభాగమైన ఇన్‌స్టామార్ట్‌ (Instamart) వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. ఇప్పటివరకు నిత్యావసర సరకుల డెలివరీకే పరిమితమైన ప్లాట్‌ఫామ్‌.. ఇకపై దుస్తులు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, స్టేషనరీ.. ఇలా 35 రకాల వస్తువులను అందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా తన ఆన్‌లైన్‌ రిటైల్‌ విభాగమైన స్విగ్గీ మాల్‌ (Swiggy Mall)ను ఇన్‌స్టామార్ట్‌తో అనుసంధానం చేసినట్లు గురువారం తెలిపింది.

లింక్‌ క్లిక్‌ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్‌ మూలాలు చెక్‌ చేయండి..

స్విగ్గీ మాల్‌ అనేది అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తరహాలోనే స్పోర్ట్స్‌ గూడ్స్‌, ఫుట్‌వేర్‌, దుస్తులు, ఎలక్ట్రానిల్స్‌, ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు, బొమ్మలు, స్టేషనరీతో పాటు పలు రకాల వస్తువులు డెలివరీ చేసే ఓ ప్లాట్‌ఫామ్‌. బుక్‌ చేసిన గంటలోనే వస్తువులను డెలివరీ అందించడం దీని ప్రత్యేకత. ఈతరహా సేవల్ని స్విగ్గీ మాల్‌ ఇప్పటికే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఇన్‌స్టామార్ట్‌ సేవలు 25 కంటే ఎక్కువ నగరాల్లో ఉన్నాయి. ‘‘ఈ అనుసంధానంతో కస్టమర్లు ఇకపై 35కి పైగా కేటగిరీల్లో ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. నిమిషాల్లోనే డెలివరీ పొందొచ్చు’’ అని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ అధిపతి ఫణి కిషన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని