Tata group: టాటాల చేతికి చింగ్స్‌.. డీల్‌ విలువ ఎంతంటే?

Tata group: టాటా గ్రూప్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ చింగ్స్ పేరిట సాస్‌లను విక్రయించే క్యాపిటల్‌ ఫుడ్స్‌ను, ఆర్గానిక్‌ ఇండియాను కొనుగోలు చేయబోతోంది.

Published : 13 Jan 2024 16:30 IST

దిల్లీ: కన్జూమర్‌ గూడ్స్‌ ఇండస్ట్రీస్‌పై టాటా గ్రూప్‌ (Tata group) మరింత ఫోకస్‌ పెట్టింది. చింగ్స్‌ పేరిట దేశీ- చైనీస్‌ సాస్‌లు, స్మిత్‌ అండ్‌ జోన్స్‌ పేరిట అల్లంవెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసే క్యాపిటల్‌ ఫుడ్స్‌ను కొనుగోలు చేయనుంది. ఆర్గానిక్‌ టీలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు విక్రయించే ఆర్గానిక్‌ ఇండియానూ సొంతం చేసుకోనుంది. ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ విభాగంలో తన ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి ఈ కొనుగోళ్లు టాటాకు దోహదం చేయనున్నాయి.

క్యాపిటల్‌ ఫుడ్స్‌ను రూ.5,100 కోట్లకు, ఆర్గానిక్‌ ఇండియాను రూ.1900 కోట్లకు టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయనుంది. క్యాపిటల్‌ ఫుడ్స్‌లో తొలుత 75 శాతం కొనుగోలు చేసి మూడేళ్లలో మిగిలిన 25 శాతం వాటాను దక్కించుకోనుంది. ఆర్గానిక్‌ ఇండియాలో పూర్తి వాటాలను టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయనుంది. క్యాపిటల్‌ ఫుడ్‌ పూర్తి ఆపరేటింగ్‌ కంట్రోల్‌తో పాటు, బోర్డులో మెజారిటీ సభ్యులు టాటా వ్యక్తులే ఉంటారని టాటా కన్జూమర్‌ పేర్కొంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజయ్‌ గుప్తా కన్సల్టెంట్‌గా కొనసాగుతారని తెలిపింది.

కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు లాభమేనా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్‌ ఫుడ్స్‌ టర్నోవర్‌ రూ.770 కోట్లుగా ఉంది. ఆర్గానిక్‌ ఇండియా టర్నోవర్‌ రూ.370 కోట్లు. ఈ కొనుగోళ్ల ద్వారా వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోగలమని, దీన్నో వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నామని టాటా కన్జూమర్‌ ఎండీ, సీఈఓ సునీల్‌ డిసౌజా పేర్కొన్నారు. టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఇప్పటికే టాటా సాల్ట్‌, టాటా టీ గోల్డ్‌, టెట్లీ, హిమాలయన్‌, టాటా కాపర్‌+ పేరిట వివిధ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని