మాంసం తినని.. మద్యం తాగని వారికే ఉద్యోగం: చైనా కంపెనీ వింత ప్రకటన

Chinese Firm: డ్రాగన్‌కు చెందిన ఓ కంపెనీ ఉద్యోగుల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు సామాజికమాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Updated : 18 Jul 2023 11:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా (china)కు చెందిన ఓ కంపెనీ అభ్యర్థుల కోసం ప్రకటన జారీ చేసింది. తమ సంస్థలో పనిచేయాలంటే పాటించాల్సిన నిబంధనల గురించి అందులో పేర్కొంది. మాంసం తినని, మద్యం తాగని, స్మోకింగ్‌ చేయని వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. కంపెనీ వెల్లడించిన ఈ కండీషన్లను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ప్రస్తుతం ఇది చైనాలో వైరల్‌గా మారింది.

షెంజెన్‌లోని ఓ సంస్థకు చెందిన హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగితో జరిపిన సంభాషణ గురించి ఓ అభ్యర్థి సామాజికమాధ్యమాల్లో పంచుకున్నాడు. దాంతో పాటు ఓ స్క్రీన్ షాట్‌ను పోస్ట్‌ చేశాడు. అందులో.. ‘కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ.57,000 అందిస్తాం. అయితే అభ్యర్థులు పొగ తాగరాదు, మద్యం తీసుకోరాదు, మాంసం తినరాదు’ అని ఉంది. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించిన సమయంలో సదరు నియామక అధికారి ప్రశ్నలకు బదులిస్తూ.. మాంసం తినకూడదా? మద్యం తాగకూడదా? అని ఓ అభ్యర్థి ప్రశ్నించాడు. దీంతో ఇంటర్వ్యూ చేసే అధికారి స్పందిస్తూ.. తాము ఎవరి హక్కులను ఉల్లంఘించేందుకు ఈ నిబంధనలు తీసుకురాలేదని, కేవలం కంపెనీ కొర్పొరేట్ సంస్కృతి కోసమే వీటిని అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికీ పెద్ద షేర్లే చౌక

ఆరోగ్యకర కార్పొరేట్ సంస్కృతిలో భాగంగానే తమ క్యాంటిన్‌లో సైతం మాంస పదార్థాలు అందించటం లేదని సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగి తెలిపారు. అయితే క్యాంటిన్‌లో భోజనం చేయని వారు, ఇంటి నుంచి ఆహారం తెచ్చుకొనే వారికి ఈ కార్పొరేట్ సంస్కృతి వర్తిస్తుందా? అని ప్రశ్నించగా.. వర్తించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ జాబ్‌ పోస్టింగ్‌లోని నిబంధనల అంశాలు చైనా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని